సినిమా

Big breaking: బండ్ల గణేష్‌ని అరెస్ట్ చేయనున్న పోలీసులు..!?

Share

Big breaking:తెలుగు సినిమా ఆర్టిస్ట్ బండ్ల గణేష్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఒక మామ్మూలు ఆర్టిస్టుగా మొదలైన బండ్ల జీవితం పెద్ద నిర్మాతగా ఎదిగే స్థాయికి చేరడంలో ఎంతో కృషి ఉందని చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్, టెంపర్ వంటి సూపర్ హిట్స్ బండ్ల ఖాతాలో వున్నాయి. అటు సినిమాలే కాకుండా ఇటు రాజకీయంగానూ బండ్ల నిరూపించుకోవాలనే ఆలోచనతో 2019లో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ వైఫల్యం తరువాత బండ్ల సైలెంట్ అయ్యారు. మధ్యలో 7 o clock బ్లేడుతో బండ్ల టాక్ అఫ్ ది టౌన్ గా మారడం అందరికీ తెలిసినదే.

Skin Care: ఉప్పుతో ఇలా చేస్తే చర్మం మెరవడం ఖాయం..!!

బండ్ల గణేష్‌ అరెస్ట్ కి కారణాలు ఇవే..

తాజాగా బండ్లపై అరెస్ట్ వారెంట్ ఇష్యు అయ్యింది. వివ‌రాల్లోకి వెళితే, ఒంగోలు తాలూకా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తి వేసిన కేసు కారణంగా బండ్లపై అరెస్ట్ వారెంట్ ఇష్యు అయింది. ఇకపోతే బండ్ల అతగాడికి 1,25,00000 రూపాయ‌ల చెక్‌ను ఇవ్వగా అది బౌన్స్ అయ్యింది. దాంతో వెంక‌టేశ్వ‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు. అందువలన విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ కోర్టు ప‌లుసార్లు బండ్ల గ‌ణేష్ కి ఆదేశాలు పంపింది. కానీ బండ్ల గ‌ణేష్ సైడ్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దీంతో ఒంగోలు సెకండ్ AMM కోర్టు జ‌డ్జి బండ్ల గ‌ణేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజ‌రు ప‌ర‌చాలని పోలీసుల‌కు ఆదేశాల‌ను జారీ చేశారు.

Pawan Kalyan: హీరో నాని పై పొగడ్తలు వర్షం కురిపిస్తున్న పవన్ ఫ్యాన్స్..!!
బండ్ల గ‌ణేష్ గతంలోను ఇలా ఓ కేసులో ఇరుక్కు పోయారు..

బండ్ల గ‌ణేష్ గతంలో ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయ్యి కోర్టుకు వెళ్లారు. ఆ వివరాలు చూసుకుంటే, క‌డ‌ప జిల్లాకు చెందిన మ‌హేష్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర 1,30,00000 రూపాయ‌లు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించ‌లేదు. దాంతో విసుగు చెందిన మ‌హేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు న‌మోదు చేసి క‌డ‌ప‌జిల్లా తాలూకా మెజిస్ట్రేట్ బండ్ల గ‌ణేష్‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యు చేశారు. ఇపుడు తాజాగా మళ్ళీ బండ్లపైన అటువంటి కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.


Share

Related posts

హీరోయిన్ ఫైన‌ల్ కాలేదు.. అయినా అఖిల్ ప్రారంభించాడు

Siva Prasad

Aradya Latest Gallerys

Gallery Desk

కాజ‌ల్ ఈజ్ బ్యాక్‌.. గుర్రపు స్వారీతో అద‌ర‌గొట్టిన చంద‌మామ‌!

kavya N