Vijay Devarakonda: ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విజయ్ దేవరకొండకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు, ఐదు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు పడుతున్నాయి. గత ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు నెలలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు విజయ్ దేవరకొండ బాడీ వర్కౌట్ చేయడం జరిగింది. అయినా గాని ఫలితం నిరాశపరిచింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమ కథ నేపథ్యంలో “ఖుషి” సినిమా చేస్తున్నారు.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది. ఇక ఇదే సమయంలో కెరియర్ లో “గీతాగోవిందం” లాంటి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తాజాగా సినిమా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే చాలామంది దర్శకులకు లక్కీ హీరోయిన్. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లు నిలిచాయి. కానీ కరోనా తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. రాధే శ్యాం, ఆచార్య, కీసీ కా భాయ్ కిసీ కా జాన్, సర్కస్… అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి.
వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న హీరోయిన్ పూజ హెగ్డేనీ ఇప్పుడు పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఎంపిక చేయటం పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. హీరోయిన్ మార్చితే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మినహా మరొక సినిమాలో చేయడం లేదు. అంతా ఓకే అయితే పరుశురాం.. విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.