Pooja Hegde: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఫార్ములాను సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తూచ తప్పకుండా ఫాలో అవుతుంటారు. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లను వెనకేసుకోవాలని భావించి.. వచ్చిన ఆఫర్లను క్యాష్ చేసుకుంటారు. అయితే ఈ విషయంలో టాలీవుడ్ పుట్టబొమ్మ నయా స్ట్రాటజీని ప్లే చేస్తోంది.
ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తున్న ఈ భామ.. మరోవైపు ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు.. ఐటెం సాంగ్స్ కు కాస్త దూరంగా ఉంటారు. కానీ, పూజా హెగ్డే మాత్రం అందుకు భిన్నం. అటు సినిమాలు, ఇటు ఐటెం సాంగ్స్ రెండిటినీ కవర్ చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందుకు కారణం లేకపోలేదు. ఓ స్టార్ హీరోయిన్ను ఐటెం సాంగ్ కోసం తీసుకుంటే.. ఆమెకు దాదాపు ఒక సినిమాకి ఇచ్చే రెమ్యునరేషన్లో సగం అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. స్టార్ హీరోయిన్స్ కొన్ని నెలల పాటు కష్టపడితే వచ్చే సొమ్ము.. ఒక్క ఐటెమ్ సాంగ్ తో వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ఐటెం సాంగ్స్‌కు నో చెప్పడం లేదట. గతంలో `రంగస్థలం` లో జిగేల్ రాణిగా ఓ ఊపు ఊపేసిన పూజా.. మొన్నీమధ్య రిలీజ్ అయిన `ఎఫ్3`లోనూ స్పెషల్ సాంగ్ చేసింది.
అయితే తాజాగా ఈమె మరో ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బాలీవుడ్లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `యానిమల్` అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక హీరోయిన్. ఇటీవలె షెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. దాని కోసం మేకర్స్ పూజా హెగ్డేను సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది.