Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే.. గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈమె నుంచి చివరగా వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
ఆ తర్వాత బీస్ట్, ఆచార్య చిత్రాలు సైతం ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దీంతో ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి పూజా హెగ్డేనే కారణమని, ఆమెది ఐరెన్ లెగ్ అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేపై ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఆమెను ఏ సినిమాలోనూ తీసుకోవద్దంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.
అయితే ఇన్నాళ్లు ట్రోల్స్‌పై సైలెంట్‌గా ఉన్న పూజా హెగ్డే.. ఎట్టకేలకు మౌనం వీడింది. రీసెంట్‌గా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తనపై ఐరెన్ లెగ్ అని ముద్ర వేసి ట్రోల్స్ చేస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. `ఓటమి, గెలుపు రెండు నాకు సమానం. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య కథలు నచ్చే వాటిని నేను అంగీకరించాను.
ఒక్కోసారి ఫలితాలు తేడాగా రావొచ్చు. మనం ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ, నేను ఒకే చేసిన చిత్రాల రిజల్ట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను. అయినా గతంలో నేను ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేశాను. అందుకు నేను సంతోషిస్తున్నాను.` అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్‌లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…