Pooja Hegde: చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఇంకా ఆశ రెట్టింపు అవుతుంది పూజా హెగ్డేకు. స్టార్ హీరోయిన్ ఇటు సౌత్‌లో తెలుగు, తమిళం..అటు నార్త్‌లో బాలీవుడ్ సినిమాలు చేస్తోంది ఈ పొడుగుకాళ్ళ సుందరి. ఇటీవలే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాతో వచ్చింది. అయితే, ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా ఈ సినిమా ప్రభావం పూజాపై కాస్తకూడా పడలేదనే చెప్పాలి. తెలుగులో కొత్తగా ఆమె మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించబోతోంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాలలో సందడి చేయనుంది.
ఇక తాజాగా ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా బీస్ట్ ఈ నెల 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. కళానిది మారన్ సన్ పిక్చర్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అరబిక్ కుత్తు, జాలియ జింఖానా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతుంటడంతో తాజాగా హైదరాబాద్‌లో
తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు.
Pooja Hegde: బీస్ట్ సినిమాతో పూజా హెగ్డే కోలీవుడ్‌లో హిట్ అందుకుంటుందా..?
ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే ..చిత్ర విశేషాలు మీడియావారితో పంచుకుంది. చిత్ర దర్శకుడిని పొగడ్తలతో ముంచేసింది. ఇక హీరో విజయ్ గురించి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడింది. అంతేకాదు, మరోసారి అవకాశం వస్తే విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తాని అటు దర్శక నిర్మాతలకు ఇటు విజయ్‌కు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. దాంతో నెటిజన్స్ వరుసగా అవకాశాలు వస్తున్నాయి కదా..అయినా ఈ అత్యాశ ఏంటీ పూజా అంటూ కామెంట్స్
చేస్తున్నారు. మరి ఇంత హడావుడి చేస్తున్న బీస్ట్ సినిమాతో పూజా హెగ్డే కోలీవుడ్‌లో హిట్ అందుకుంటుందా లేదా చూడాలి.