సినిమా

Venkatesh-Pooja Hegde: వెంకీకి చెల్లెలుగా పూజా హెగ్డే.. నెట్టింట క్రేజీ న్యూస్ హ‌ల్‌చ‌ల్‌!

Share

Venkatesh-Pooja Hegde: విక్ట‌రీ వెంక‌టేష్ త్వ‌ర‌లోనే `ఎఫ్ 3` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇందులో మ‌రో హీరో కాగా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. వెంక‌టేష్, పూజాలు ఈ మూవీతోనే తొలిసారి స్క్రీన్ షేర్ చేస్తున్నారు.

అయితే వీరిద్ద‌రూ మ‌రో చిత్రంలోనూ క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట‌. పైగా అందులో వెంక‌టేష్‌కు చెల్లెలుగా పూజా హెగ్డే క‌నిపించ‌బోతోంద‌ని ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పూర్తి వివార‌ల్లోకి వెళ్తే.. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో `క‌భి ఈద్ క‌భి దివాళి` అనే మూవీ చేస్తున్నాడు.

సాజిద్ న‌దియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక అయింది. అలాగే ఓ కీల‌క పాత్రలో వెంక‌టేష్ న‌టించ‌బోతున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ల్మాన్ స్పెష‌ల్‌గా రిక్వ‌స్ట్ చేయ‌డంతో వెంకీ వెంటనే ఒప్పుకున్నార‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే వెంకీ స‌ల్మాన్‌తో క‌లిసి షూటింగ్‌లో సైతం జాయిన్ కానున్నాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో వెంక‌టేష్ చెల్లెలుగా పూజా హెగ్డే క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే అని అంటున్నారు.

 


Share

Related posts

Cinema Tickets: జగన్ కి మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు! మూవీ టికెట్‌ రేట్స్ నిర్ణయించే అధికారం లేదని హెచ్చరిక!

Ram

TFI: నిన్నటి నుండి ఒకటే గోల..! ఆ పెద్ద సినిమా ఓటిటి కి ఇచ్చేస్తున్నారట

arun kanna

Chiranjeevi: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే… టాప్ మోస్ట్ నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar