సినిమా

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే రొయాన్స్‌.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

Share

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ చేతిలో ప్ర‌స్తుతం ఈ మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో `లైగ‌ర్‌` షూటింగ్ ఇప్ప‌టికే పూర్తిగా కాగా.. ఆగ‌స్టులో ఈ చిత్రం విడుద‌ల కానుంది. అలాగే స‌మంత‌తో క‌లిసి విజ‌య్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ క‌థా చిత్రం చేస్తున్నాడు. `విడి11` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది.

ప్రస్తుతం కాశ్మీర్‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతోంది. అలాగే మొన్నా మ‌ధ్య ముంబై వేదిక‌గా `జ‌న‌గ‌ణ‌మ‌న‌` అనే కొత్త ప్రాజెక్ట్ ను విజ‌య్ అనౌన్స్ చేశాడు. లైగ‌ర్‌ను తెర‌క్కించిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానుంది.

మ‌రి కొద్ది రోజుల్లోనే పూరీ రెగ్యుల‌ర్ షూట్‌ను షురూ చేయ‌బోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో విజ‌య్‌కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేను ఫైన‌ల్ చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. విజ‌య్‌తో రొమాన్స్ చేసేందుకు పూజా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్తలు వ‌స్తున్నాయి.

దీంతో వ‌ద్దు బాబోయ్ వ‌ద్దు, విజ‌య్ కు జోడీగా పూజా హెగ్డే అస్స‌లు వ‌ద్దు అంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందుకు కార‌ణం లేదుపోలేదు. ఈ మ‌ధ్య పూజా న‌టించిన భారీ చిత్రాలు రాధేశ్యామ్‌, బీస్ట్ మ‌రియు ఆచార్య‌లు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోకు ఆమెపై కొంద‌రు ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా వేసేశారు. అందుకే విజ‌య్ అభిమానులు ఆమెను హీరోయిన్‌గా తీసుకోవ‌ద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

KGF: కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న KGF 2.. అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డ్!

Ram

ఆ సినిమా అనౌన్స్‌మెంట్ రాగానే ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్..ఇదంతా ఆ దర్శకుడి వల్లేనా ..?

GRK

పుష్ప సినిమాని సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేయనున్నారా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar