Pooja Hegde: సమంత పెళ్లి అయిపోయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో తెలుగు లేని బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సినిమాలలో నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ లో అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతోంది. గత ఏడాది ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన “అల వైకుంఠపురం లో” హీరోయిన్ పాత్ర చేసి సినిమాకి హైలెట్ అయ్యింది.
ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఈ అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ అందుకుంది. మేటర్ లోకి వెళ్తే కండల వీరుడు సల్మాన్ ఖాన్ నెక్స్ట్ నటించబోయే ఎంటర్టైన్మెంట్ సినిమాలో అవకాశం వచ్చినట్లు ఇటీవల పూజా హెగ్డే సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
సల్మాన్ ఖాన్ పక్కన అంటే మామూలు విషయం కాదు. చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ హీరోయిన్లు సల్మాన్ ఖాన్ పక్కన నటించి తిరుగులేని కెరీర్ సొంతం చేసుకున్నారు. అటువంటి హీరో పక్కన తనకు అవకాశం రావడం నిజంగా అదృష్టం … కామెడీ నేపథ్యంలో కలిగిన సినిమా అని స్పష్టం చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో నెటిజెన్లు… పూజా హెగ్డే పంట బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పండినట్లే అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.