Pooja Heghde: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లక్కీ హీరోయిన్ గా పూజా హెగ్డే కి మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో టాప్ నిర్మాతలు ప్రస్తుతం చాలా వరకు హీరోయిన్ ల విషయంలో పూజా హెగ్డే కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు కూడా “బీస్ట్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా.. నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక భాషలలో ఇంకా బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో… సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూజా హెగ్డే నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుండటంతో… రొమాన్స్ బాగా పెరుగుతూ ఉండటంతో ఈ ముద్దుగుమ్మ… వస్తున్న అవకాశాలకు.. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసినట్లు సరికొత్త వార్త ట్రెండ్ అవుతుంది. ఏకంగా ఒక్కో సినిమాకి 3 నుండి 4 కోట్లు పూజా హెగ్డే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలావరకు అమ్మడుకి మంచి మార్కెట్, హిట్ ట్రాక్ ఉండటంతో… నిర్మాతలు ఎంత డబ్బు ఇవ్వడానికైనా రెడీగా ఉంటున్నారట.
ఇదిలా ఉంటే తెలుగులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్… హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న “భవదీయుడు భగత్ సింగ్”.. ఇంకా పలు పెద్ద ప్రాజెక్టులు చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఒక తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కొత్త ప్రాజెక్టులకు కూడా పూజా హెగ్డే హీరోయిన్ ఛాన్స్ అనుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో అవకాశాలు వరుసగా వస్తు ఉండటంతో డిమాండ్ భారీగా పెరగడంతో… పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.