Vijay Pooja Heghde: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలలో మొదటి వరుసలో ఉండే వారిలో తలపతి విజయ్ ఒకరు. దాదాపు రజనీకాంత్ అంత కాకపోయినా గానీ ఇంచుమించు అక్కడిదాకా క్రేజ్ ఉన్న వ్యక్తి. విజయ్ సినిమా విడుదల అవుతుందంటే చాలు కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రచ్చ మామూలుగా ఉండదు. ఆరోజు మిగతా సినిమాలు విడుదల చేయడానికి కూడా ఆలోచన చేసే పరిస్థితి. అంతగా ప్రభావితం చేసే విజయ్ ప్రస్తుతం రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నాడు.
ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రహస్యంగా భేటీ అయినట్లు కూడా ఇటీవల వార్తలు రావడం మనం విన్నాం. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా విజయ్ వ్యక్తిత్వం మరియు సినిమా సెట్ లో ఎలాగ ఉంటాడో… అనేదాని గురించి హీరోయిన్ పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్టార్ హీరో విజయ్ చాలా సైలెంట్ వ్యక్తి అని, ఎప్పుడూ కూడా ఒంటరితనం గా ఏకాంతంగా ఉంటారని.. పూజా హెగ్డే తెలిపింది.
సెట్ లో ఉన్నంత సేపు తన పరిధిలో తాను ఉంటాడు. ఇక ఇదే సమయంలో ఆడవాళ్ళను బాగా గౌరవిస్తాడు.. వాళ్ల గురించి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇదే నాకు విజయ్ లో బాగా నచ్చే అంశమని పూజా హెగ్డే స్పష్టంచేసింది. కాగా వీరిద్దరూ కలిసి నటించిన “బీస్ట్” సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఈ మూవీలో అరబిక్ ఉర్దూ స్పెషల్ డాన్స్ సాంగ్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. విజయ్ మరియు పూజా హెగ్డే వేసిన స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. ఇదే స్టెప్పులు మిగతా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వేస్తూ వైరల్ అవుతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!