Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులతో సతమతమైనప్పటికీ అల్లు అర్జున్‌కు జోడీగా`దువ్వాడ జగన్నాథం(డీజే)` చిత్రంలో నటించి హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుస ఆఫర్లతో పాటు వరుస హిట్లను కూడా ఖాతాలో వేసుకుంటూ అనతి స్టార్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీగా హీరోయిన్గా మారిపోయింది. ఇకపోతే షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్స్‌కి చెక్కేసే పూజా హెగ్డే.. తొలిసారి తన ప్రియమైన సోదరుడు మరియు తల్లిదండ్రులతో మాల్దీవ్స్‌కి వెళ్లింది.
ప్రస్తుతం అక్కడ ఈ బ్యూటీ ఫ్యామిలీతో ఫుల్‌గా చిల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన పూజా హెగ్డే.. `13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో వెకేషన్ కోసం బయటకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది.` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడు పూజా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌కు జోడీగా ఈమె చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పూజా నటించిన ఆచార్య, బీస్ట్, సర్కస్, రాధే సినిమాలు సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.