Pooja Hegde: ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పూజా హెగ్డే అందుకోవడం జరిగింది. చాలామంది దర్శకులకు నిర్మాతలకు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్. ఆమె నటిస్తుంది అంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. గోల్డెన్ లెగ్ అని ఆమెకు పేరు ఉంది. అప్పట్లో అలా వైకుంటపురం, మహర్షి, అరవింద సమేత వీర రాఘవ… ఇంకా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించాయి. ఒక తెలుగులో మాత్రమే కాదు దక్షిణాదిలో పలు భాషల్లో పూజా హెగ్డే నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. దీంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని.. పేరు రావడంతో ఒక్కసారిగా అవకాశాలు ఎక్కువ రావటంతో చేతినిండా సినిమాలు ఉండటంతో… తల పొగరు ఎక్కువైపోయింది.
ఈ క్రమంలో సినిమా సెట్స్ కి టైం కి రాకపోవడంతో పాటు గొడవలు పెట్టుకోవడం… ఇంకా ఇదే సమయంలో తనతో పాటు టీం మెంబర్స్ నీ వదుల సంఖ్యలో తెచ్చుకుని నిర్మాతలకు భారీగా ఖర్చు చేసేటట్లు బిల్స్ ఏపించటం వంటివి చేసి ప్రస్తుతం అనేక అవస్థలు పడుతూ ఉంది. పాండమిక్ తర్వాత పూజా హెగ్డే తలరాత పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళ్తే ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్, మాస్క్… ఇటీవల సల్మాన్ ఖాన్ తో నటించిన “కీసి కా భాయ్ కీసి కా జాన్” సినిమాలు వరుసగా అయిదు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో పూజ హెగ్డే తో సినిమా అంటేనే ఇప్పుడు నిర్మాతలు భయపడే పరిస్థితి నెలకొంది. గోల్డెన్ లెగ్ కాస్త ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న “SSMB 28”, పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” తో సినిమా చేస్తున్నారు.
ఈ రెండిటిపైనే పూజ హెగ్డే ఆశలు పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా పైన పూజ హెగ్డే చాలా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గతంలో అలా వైకుంఠపురం లో, అరవింద సమేత వీర రాఘవ లో… అద్భుతంగా చూపించడం జరిగింది. దీంతో ఈసారి మహేష్ సినిమా పైన పూజా హెగ్డే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ కానుంది. మే నెలలో కృష్ణ పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా రూపంలో పూజ హెగ్డే మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.