సినిమా

Pooja Hegde: ఫ్లాపులతో బాధపడుతున్న పూజా హెగ్డేకు ఊరట.. ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టదుగా!

Share

Pooja Hegde: పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే గురించి తెలియని తెలుగు యువత ఉందనే చెప్పుకోవాలి. మెల్లగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇపుడు ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది పూజ. ఓ వైపు సౌత్‌లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో కూడా వరుసగా క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. కాగా ప్రస్తుతం పూజాకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ బోల్తా కొడుతున్నాయి. అవి కూడా భారీ సినిమాలు. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాపవడంతో తీవ్ర నిరాశలో ఉంది పూజా హెగ్డే. కాగా ఇలాంటి పూజకు ఓ ఆశాకిరణంలాగా ఓ అవకాశం వచ్చింది.

Pooja Hegde: ఆ అవకాశం ఇదే:

ఏదిఏమైనా తెలుగులో ఆమెకు భారీ సినిమాలే వున్నాయి. తాజాగా అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ అయిన సినిమాలు 2. వాటిలో ఒకటి మహేశ్ బాబుతో, రెండవది పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం. ఇక ఇవి కాకుండా బాలీవుడ్‌లో 2 సినిమాలు చేస్తోంది. ఆ సినిమాలు గనక హిట్ అయితే బాలీవుడ్‌లో ఇంకా ఆమె అవకాశాలు అందుకుంటుంది. అలాగే, ఇక్కడ కూడా చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ఓకే..లేదంటే అమ్మడి కెరీర్ డైలమాలో పడటం గ్యారెంటీ. ఇలాంటి తరుణంలో పూజా ఉండగా అనుకోకుండా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది.

మరింత సమాచారం:

ఈ ఆహ్వానం అందటంతో అమ్మడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. కాగా మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ఫెస్టివల్‌‌ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి సీనియర్ తారలు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పూజాకు చోటు దక్కడం విశేషం. అయితే, ఈ అరుదైన అవకాశం వస్తుందని అమ్మడు అస్సలు ఊహించలేదు. 17, 18 తేదీల్లో పూజా కేన్స్‌లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో పూజా ఆ 16వ తేదీన ఇండియా నుంచి పారీస్‌కు బయల్దేరనుంది.


Share

Related posts

Sarkaru Vaari Paata: “సర్కారు వారి పాట” హైలెట్ సీన్ రివిల్ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్..!!

sekhar

Samantha – Naga Chaithanya: సమంత – నాగ చైతన్యలతో స్టార్ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశారా..?

GRK

Kajal agarwal : షాకిచ్చిన కాజల్ అగర్వాల్..15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు చేయని విధంగా..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar