Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ ప్రాజెక్టులు ఎక్కువ అందుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే. కాజల్ అగర్వాల్, సమంత, అనుష్క స్లో అయిన తర్వాత పూజా హెగ్డే దూసుకుపోతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్ ప్రాజెక్టులకి సంబంధించి.. హీరోయిన్ ల ఈ విషయంలో ఎక్కువగా పూజా హెగ్డే అదేవిధంగా రష్మిక మందన కి డైరెక్టర్లు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
ఈ తరుణంలో ఇప్పటికే “రాదేశ్యామ్” సినిమాలో నటిస్తున్నా పూజా హెగ్డే తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పటం జరిగిందట. తమిళ ఫిలిం డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న టు అందులో.. పూజా హెగ్డే నీ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నాగచైతన్యతో “ఒక లైలా కోసం” సినిమాలో నటించడం జరిగింది. అయితే మరోసారి పూజా హెగ్డేతో జత కట్టడానికి నాగచైతన్య రెడీ అయినట్లు… సౌత్ ఇండియాలో ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నటు లేటెస్ట్ టాక్.
ఇటీవలే మిస్టర్ మజ్ను అక్కినేని హీరో అఖిల్ తో.. పూజా హెగ్డే నటించింది. మళ్లీ ఇప్పుడు అన్న నాగచైతన్య తో అవకాశం అందుకోవటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. పూజా హెగ్డే అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది అని తాజా వార్త పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య ఫుల్ మాస్ క్యారెక్టర్ చేయనున్నట్లు.. ఆ రీతిగా వెంకట్ ప్రభు నాగచైతన్యని గతంలో ఎన్నడూ చూడని రీతిలో..ఉర మాస్ పాత్రలో చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.