Pooja Heghde Yaash: ప్రస్తుతం పూజా హెగ్డే టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్ గా పూజా హెగ్డే నటించడం జరిగింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలకు మరియు దర్శకులకు పూజ హెగ్డే లక్కీ హీరోయిన్ అనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ తో అమ్మడు చాలా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సల్మాన్ ఖాన్ ఇంకా కొంత మంది స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంటూ నటిస్తూ ఉంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా “కేజిఎఫ్” స్టార్ హీరో యాష్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే కేజిఎఫ్ రెండు సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేయడం తెలిసిందే. “KGF 2” ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో యాష్ కి పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని క్రేజ్ క్రియేట్ అయ్యింది.
అయితే “KGF 2” తర్వాత యాష్ ఏ సినిమా చేస్తాడు అన్నది సస్పెన్స్ గా ఉన్న సమయంలో…నార్తన్ దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టుతో యాష్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా పూజాహెగ్డే అని అనుకుంటున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అంతా ఓకే అయితే అనుకున్నట్టు జరిగితే కన్నడ ఇండస్ట్రీ లో పూజా హెగ్డేకి ఇది తొలి సినిమా అవుతుంది. అంతమాత్రమే కాదు ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!