Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” పోస్టర్ పై నటి పూనమ్ కౌర్ రిటర్ వేదికగా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి గ్లింప్స్ వీడియో జనవరి 11వ సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు పదవ తారీకు నాడు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ స్పెషల్ పోస్టర్ లో పవన్ పాదాల కింద స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ పేరు ఉంచటంపై పూనమ్ కౌర్ మండిపడ్డారు. “స్వాతంత్ర సమరయోధులను మీరు గౌరవించ లేక పోతే పోయారు కానీ, కనీసం వారిని మాత్రం అవమానించకండి.
రీసెంట్ గా ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్ లో భగత్ సింగ్ పేరును పాదాల కింద ఉంచి అవమానించారు… ఇది అహంకారమా..? అజ్ఞానమా?” అని నిలదీశారు. అనంతరం మరో ట్విట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ .. రీట్వీట్ చేస్తూ….”స్వాతంత్ర సమర యోధుడునీ కచ్చితంగా అవమానించడం లాంటిదే. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్ కు రిపోర్ట్ చేయండి” అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే మే 11 వ తారీకు నాటికి హరీష్ మరియు పవన్ కలయికలో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు కావటంతో… నేడు “ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేస్తున్నారు.
అప్పట్లో గబ్బర్ సింగ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కృషి వంటి అతిపెద్ద విజయం తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించడానికి అనేక సంవత్సరాలు పరాజయాలు చూసిన పవన్ మళ్ళీ “గబ్బర్ సింగ్” రూపంలో విజయాన్ని అందుకున్నాడు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకోవడం జరిగింది.