ఇండస్ట్రీలో కొన్ని సున్నితమైన విషయాలు బయటకు వచ్చి బట్టబయలు అయ్యాక అవే పెద్ద సెన్షేషనల్ న్యూస్ అవుతుంటాయి. ఇందులో వాస్తవాలు ఏంటన్నది అసలు ఇద్దరు వ్యక్తుల కి తప్ప మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోను తెలిసే అవకాశమే లేదు. అయితే అసలు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎప్పుడైతే బయట పడి వాపోతుంటారో వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువవుతుంటుంది.
స్టార్ డైరెక్టర్.. హీరో…ప్రొడ్యూసర్… ఎవరైనా సరే తన హోదాని అడ్డు పెట్టుకొని ఆడుకోవాలని చూస్తుంటారు. అలాంటప్పుడే బాధను అనుభవిస్తున్న వ్యక్తిలో ఇంకా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.
అదే ఇప్పుడు పూనం కౌర్ విషయంలో జరిగింది. గతంలో తను మోసపోయానంటూ ఎన్నో సందర్భాలలో వాపోయింది. ఒక స్టార్ హీరోతో నా జీవితం కొనసాగబోతున్న సమయంలో అతడి స్నేహితుడు ..స్టార్ డైరెక్టర్ అడ్డు పడి నన్ను, నా జీవితాన్ని చిన్నా భిన్నం చేశారని బహిర్గతంగానే వెల్లడించింది. అయితే అంత పక్కాగా ఆ ఇద్దరు ఎవరూ అన్నది ఇన్నాళ్ళు తెలియలేదు. కాని ఇప్పుడు ఆ ఇద్దరు పేరున్న వ్యక్తులెవరో దాదాపు అందరికీ అర్థం అయ్యోలా సంచలన వ్యాఖ్యలు చేసింది.
స్టేజ్ మీద పెద్ద పెద్ద స్పీచ్ లు ఇస్తూ సావిత్రి లాంటి వాళ్ళ గురుంచి ఆవిడ నటన గురించి గొప్పగా మట్లాడం తెలిసిన మీకు ఇక్కడి వాళ్ళను ఎంకరేజ్ చేయడం సినిమాలలో మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం మాత్రం తెలీదంటూ వ్యాఖ్యలు చేసింది. పెద్ద వాళ్ళ పేరు వాడుకొని వాళ్ళ అండ చూసుకొని అన్ని మానిప్యులేట్ చేస్తావని సూటిగా కడిగేసింది. అంతేకాదు నన్ను సినిమాలో నుండి తప్పించావని ”నీ ఫ్రెండ్ తను ప్రేమించే భార్య దగ్గరకి వెళ్లకుండా అడ్డుకున్నావ్…”మీ స్వలాభం కోసం మీ ఫ్రెండ్ జీవితాన్ని మానిప్యులేట్ చేసావ్. ..నువ్వు భజన తప్ప మరేమీ చేయలేదు. నన్ను సైలెంటుగా బ్యాన్ చేయాలని చూసావ్. అది ఓకే. కానీ నువ్వు #గురుజి కాదు” అని ట్వీట్ చేసింది పూనం కౌర్.