Poonam Kaur: ఇటీవల హైదరాబాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ టాలీవుడ్ ఇండస్ట్రీ గొప్పదనాన్ని చాటి చెప్పడం తెలిసిందే. భారతీయ చలన చిత్ర రంగ స్థాయిని టాలీవుడ్ పెంచిందని కీర్తించారు. దీంతో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇక ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లతో మరియు హీరోలతో పాటు… ఇతర ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు సినిమాలు చేస్తున్నారు. అంతమాత్రమే కాకుండా ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ లు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లాపుల్లో ఉన్న చాలా మంది హీరోలు తెలుగు సినిమాలను బాలీవుడ్ లోకి రీమేక్ చేసి.. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం జరిగింది. ఈ విధంగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షాహిద్ కపూర్ ఇంకా చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోలు ఫ్లాపుల్లో ఉన్న సమయంలో తెలుగు సినిమాలను ఆధారం చేసుకుని రీమేకులు చేసి మళ్లీ హిట్ కొట్టారు. అటువంటి తెలుగు సినిమా రంగం పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం కురిపిస్తే… మరోపక్క మోడీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తూ హీరోయిన్ పూనమ్ కౌర్ కామెంట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది.
అయినా గాని పూనం కౌర్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తెలుగు సినిమాని ప్రధాన మంత్రి అర్థం చేసుకున్న విధానానికి.. కానీ ఇక్కడ ఉన్న దుస్థితికి చాలా తేడా ఉంది’ అంటూ పూనమ్ కౌర్ సెటైర్ వేసింది. కాసేపటికి పూనమ్ తన ట్వీట్ డిలీట్ చేసింది. దీంతో తెలుగు సినిమా ప్రేక్షకులు పూనమ్ కౌర్ నీ ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా చెబితే నిర్మొహమాటంగా చెప్పాలి… కామెంట్ పెట్టి డిలీట్ చేసి ఇలా రభస చేయకూడదు. అయినా అన్నం పెట్టిన ఇండస్ట్రీ పై ఈ విధమైన వ్యాఖ్యలు సరైనది కాదు అని మండిపడుతున్నారు. దేశ చలనచిత్ర రంగ రూపురేఖలు మార్చేసిన టాలీవుడ్ పట్ల ప్రధాని ఇలాంటి వాళ్లే పొగడ్తలు కురిపిస్తుంటే నీలాంటి వాళ్ళు ఈ రీతిగా వ్యవహరించటం.. దారుణం అంటూ పవన్ కవర్ పై సీరియస్ అవుతున్నారు నెటిజన్లు.