Poorna: ప్రముఖ నటి పూర్ణ గురించి పరిచయాలు అవసరం లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2004 లో మలయాళ చిత్రం `మంజు పొలోరు పెంకుట్టి` ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అక్కడ రెండు మూడు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు.
ఇక 2011లో `సీమ టపాకాయ్` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇన్నాళ్లకు పూర్ణ కెరీర్ ఊపందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రను పోషిస్తూనే.. మరోవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. అలాగే బుల్లితెరపై పలు టీవీ షోలకు జడ్జ్‌గా కూడా అలరిస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే పూర్ణ.. నిత్యం అదిరిపోయే ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్‌కి ఫుల్ కిక్ ఇస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు చీర కట్టుకుని చందమామలా మెరిసిపోతూ ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే పూర్ణ పిక్స్‌పై లైకుల వర్షం కురిపిస్తూ.. క్యూట్, స్వీట్, సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.