NewsOrbit
Entertainment News సినిమా

BRO: అదరగొడుతున్న పవన్ “బ్రో” ఫస్ట్ సింగిల్ “మై డియర్ మార్కండేయ” సాంగ్..!!

Advertisements
Share

BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “బ్రో” నుండి విడుదలైన “మై డియర్ మార్కండేయ” సాంగ్ నేడు రిలీజ్ అయింది. తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంది. సాంగులో సాయిధరమ్ తేజ్ స్టెప్ లు అదరగొట్టాడు. సాంగ్ మొత్తం పబ్ లో చిత్రీకరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా పాటలో కనిపించి అదిరిపోయే లుక్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు. ఈ పాటలో ఊర్వశి రౌతులా కూడా స్టెప్పులు వేయడం జరిగింది. జులై 28వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

Advertisements

Popular Pawan Bro first single My Dear Markandeya song

పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఫస్ట్ టైం మెగా కాంపౌండ్ కి చెందిన హీరోతో మల్టీస్టారర్ చేసిన సినిమా కావటంతో.. “బ్రో” ఫలితం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర ఈ సినిమాలో అరగంటకు పైగా మాత్రమే ఉండబోతుందట. అయితే ఆ పాత్రని కేవలం నెలరోజుల షూటింగ్ లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నెల రోజులకు దాదాపు 40 కోట్లకు పైగానే పవన్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విడుదలైన బ్రో టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో పవన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించటం తో పాటు స్టైలిష్ లుక్ లో డైలాగులు చెబుతూ ఉండటంతో.. అంచనాలు మరింతగా పెరిగాయి.

Advertisements

Popular Pawan Bro first single My Dear Markandeya song

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగులు అందించడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జి స్టూడియో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జులై రెండవ వారం నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్.. రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరఫున వారాహి రెండో దశ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఈ యాత్ర అయిన వెంటనే “బ్రో” ప్రమోషన్ కార్యక్రమాలలో పవన్ పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. `స‌లార్‌` టీజ‌ర్ వ‌చ్చేస్తుందోచ్‌..!?

kavya N

Sri Divya White Dress Stills

Gallery Desk

Samantha: సమంతను ఐటం సాంగ్ చేస్తే ఇంత క్రేజ్ వస్తుందా..పడి చచ్చిపోతున్నారుగా ఇంకా..!

GRK