NewsOrbit
Entertainment News సినిమా

Mega: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఫస్ట్ మూవీ “మెగా” టీజర్ అదుర్స్..!!

Advertisements
Share

Mega: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అందరికీ సుపరిచితుడే. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది పేద వాళ్లకు ఎన్నో రకరకాల సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. కొంతమందికి ఇల్లు కట్టించడంతో పాటు జీవనోపాధి కూడా హర్ష సాయి అందించాడు. ఈ క్రమంలో తనకంటూ సెపరేట్ టీం ఏర్పరచుకుని వారి వివరాలు కూడా ఎవరికి తెలియనివ్వకుండా.. అప్పట్లో అనేకమైన వీడియోలు చేయటం జరిగింది. యూట్యూబ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వీడియోల ద్వారా సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో “మెగా” అనే సినిమాతో.. హీరోగా పరిచయమవుతున్నాడు.

Advertisements

Popular YouTuber Harsha Sai First Movie Mega Teaser Trending

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నేడు రిలీజ్ కావటం జరిగింది. మొదటి సినిమా టీజర్ లో హర్ష సాయి.. అందరినీ ఆకట్టుకునేలా కనిపించడం జరిగింది. దీంతో ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతాడు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా తన మొదటి సినిమా “మెగా” కి.. రైటర్ కం డైరెక్టర్ ఇంకా హీరో మూడో కూడా హర్ష సాయి కావటంతో సినీ మేధావులు సైతం.. మనోడులో టాలెంట్ నీ అభినందిస్తున్నారు. విడుదలైన “మెగా” టీజర్ లో ప్రతి ఎలిమెంట్ కూడా ఉత్కంఠ భరితంగా ఉండటంతో.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది. ప్రతి సీన్ ఎక్సైట్మెంట్ తో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Advertisements

Popular YouTuber Harsha Sai First Movie Mega Teaser Trending

సినిమా కూడా అదే రీతిలో ఫలితం సాధిస్తే మాత్రం కామన్ ప్రేక్షకుడికి హర్ష సాయి హీరోగా మరింత దగ్గరవుతాడని చెబుతున్నారు. కచ్చితంగా టీజర్ బట్టి చూస్తే మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో..సస్పెన్స్ థ్రిల్లర్ గా సొసైటీకి ఏదో చెప్పాలన్న తపనతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల కోసం హర్ష సాయి అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల కార్యక్రమం చాలా గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. మరి యూట్యూబర్ గా సక్సెస్ అయిన హర్ష సాయి హీరోగా రాణిస్తాడో లేదో చూడాలి.


Share
Advertisements

Related posts

Sreeja Konidela: నా జీవితంలో ప్రముఖమైన వ్యక్తితో కొత్త ప్రయాణం అంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

sekhar

చైనాలో `2.0` రికార్డ్ చేయనుందా?

Siva Prasad

SVP: ‘సర్కారువారి పాట’ను మొదట బన్నీ రిజక్ట్ చేశాడా?

Ram