ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌థ‌ను ఓకే చేయించుకున్న డైరెక్ట‌ర్‌!


ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడ‌ని చాలా రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై రోజుకొక వార్త బ‌య‌ట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే తాజాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి చెప్పిన క‌థ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఆయ‌న డైరెక్ట‌ర్ క్రిష్‌ని కొన్నిరోజులు ఆగ‌మ‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కంచె, వేదం, గ‌మ్యం, కృష్ణం వందే జ‌గ‌ద్గుర‌మ్.. వంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను చేసిన క్రిష్‌.. ప‌వ‌న్‌తో ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని ఆస‌క్తిగా ఉంది. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ డిజాస్ట‌ర్ త‌ర్వాత డ్రిపెష‌న్‌లో క్రిష్‌కి ప‌వ‌న్ లైన్ క్లియ‌ర్ చేస్తే.. ఇక తిరుగుండ‌ద‌న‌డంలో సందేహం లేదు.