29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ కి అడుగడుగునా కష్టాలు అప్పటి నుంచి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..!

Share

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి టాలీవుడ్ లోని ప్రముఖుల విషయాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే తాజాగా మా ఇండియా స్టార్ ప్రభాస్ జాతకం పరిశీలించి ఆయన ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Prabahs have health problems on 2023 venu Swami vairal comments
Prabahs have health problems on 2023 venu Swami vairal comments

వేణు స్వామి నీ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రభాస్ అనారోగ్యం గురించి ప్రశ్నించాగా.. అందుకు ఆయన బదులుగా.. నిజానికి నేను సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలని అనుకోను. కానీ జాతకరీత్యా వారి పర్సనల్ జీవితాలు ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి అనే విషయాన్ని చెబుతానని తెలిపారు. అలాగే విజయ్ దేవరకొండ, నాగచైతన్య సమంత వివాహం గురించి, రష్మిక మందన్న, రామ్ చరణ్ ఉపాసన పిల్లల విషయంలో నేను ఎనిమిదేళ్ల క్రితమే చెప్పానని.. కానీ అవన్నీ ఆలస్యంగా జరిగినప్పుడు అవి నిజమని నమ్ముతారు.

అయితే నేను చెప్పిన సమయంలో అందరూ నన్ను విమర్శిస్తారు. అందులో ఎంత నిజం ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అభిమానులు ప్రయత్నించరు అని వేణు స్వామి అన్నారు. 2023 నుంచి ప్రభాస్ జీవితంలో చాలా చాలా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయని.. సినిమా పరిశ్రమ దృష్ట్యా ఇబ్బందులు ఉన్నాయని.. ప్రస్తుతం ఆయన జాతకం దృష్ట్యా శని, గురువు స్థానాలు మారుతున్నాయని.. అవి ప్రభాస్ ఇబ్బందికరంగా ఉందని.. దానివలన ఆయన అనేక ఇబ్బందులు పడక తప్పదని.. ప్రభాస్ ది వృశ్చిక రాశి అని తెలిపారు. ప్రభాస్ కి ఒకవైపు అర్థాష్టమ శని, అష్టమ గురువు, మరొకవైపు షష్ఠమ గురువు ఉండడంతో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. ప్రభాస్ అస్సలు జాతకాలను నమ్మడని, అందుకే ఆయన జాతకాలను నమ్మకుండా చేసిన జాతకాల సినిమా రాధేశ్యామ్ సినిమ డిజాస్టర్ గా నిలిచిందని వేణు స్వామి కామెంట్ చేశారు.

ప్రభాస్ తో పాటు చాలా కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని.. 2023 నుంచి అత్యంత దారుణంగా ఉండబోతుందని వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒకటి చేసి అవి జరగకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.


Share

Related posts

Heroines: టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఎంత మంచి ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ కి ఇందుకే వెళ్లడం లేదు!!

Naina

పెళ్లి అనేది అంత ఇంపార్టెంటా లైఫ్ లో? షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ?

Varun G

ఎవరు పీఠం ఎక్కితే మాకేంటి..! మేము ఇంతే..! ఓటర్ల తీరు..!

somaraju sharma