యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సినిమాల రేంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌కు చేరుకుంది. బాహుబలి సాధించిన సక్సెస్ ఎఫెక్ట్ ఇది. దీంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై చాలా కేర్ తీసుకుని ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే ప్రభాస్ `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేశాడు కూడా. ఈ సినిమాకు `జాన్` అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. కాగా.. ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సాహో షెడ్యూల్ గ్యాప్‌లో ప్రభాస్ తన 20 సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ నేటి నుండి హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రత్యేకమైన సెట్ వేశారట. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
previous post
next post