సినిమా

SVP: ‘సర్కారు వారి పాట’ సినిమాపైన డార్లింగ్ ప్రభాస్ అభిప్రాయం ఇదే!

Share

SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ”సర్కారు వారి పాట.” కాగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తాజాగా అనేకమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని చూసి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడని ప్రచారం జరుగుతోంది.

SVP: సినిమా ఇలా ఉందట!

అయితే ఈ సినిమా మాత్రం డార్లింగ్ ప్రభాస్ కు అమితంగా నచ్చిందని చెప్తున్నారు నెట్టింట్లోని జనం. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ మరియు ఫైట్స్ కూడా నచ్చాయని.. వాటిని బాగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ తన సన్నిహితులతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి ప్రభాస్ రివ్యూ ఇవ్వడమనేది ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ ను ఇపుడు ఖుషీ చేస్తోంది. ప్రభాస్ చెప్పిన మాటలను మహేష్ ఫాన్స్ ఇపుడు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం:

ఇకపోతే మహేష్ – ప్రభాస్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ కొన్నేళ్లుగా వారు చాలా మంచి స్నేహితులు. రెగ్యులర్ గా వీరు మీట్ అవ్వకపోయినా.. కలిసినప్పుడు మాత్రం ఆప్యాయంగా పలకరించుకుంటారు. వీరు మంచి స్నేహితులు అనడానికి అనేక సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రభాస్ నటించిన ‘వర్షం’ ఆడియో ఫంక్షన్ కు మహేష్ చీఫ్ గెస్టుగా రావడం కావచ్చు, ఇటీవల ఏపీ సీఎం జగన్ తో భేటీకి ఒకే ప్లైట్ లో కలిసి వెళ్లడం కావచ్చు, ఇలా అనేక విషయాలు వారిమధ్యన వున్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. ఈ బాండుతోనే ప్రభాస్ మహేష్ సినిమాని ప్రోమోట్ చేస్తున్నట్టు వినికిడి.


Share

Related posts

శర్వానంద్ లో ఆ యాంగిల్ ని జనాలు ఒప్పుకుంటారా ..?

GRK

మహేశ్ – రాజమౌళి ప్రాజెక్ట్ డీటైల్స్ హాట్ హాట్ గా లీక్ అయ్యాయి మిస్ అవ్వకండి

sekhar

Singer Sunitha: లూజ్ హెయిర్‌తో జీన్స్ ప్యాంట్‌, బ్లూ ష‌ర్ట్ వేసి సునీత అదిరిపోయే ఫొటోషూట్‌.. హీరోయిన్ కూడా ప‌నికిరాదు!

kavya N