ప్ర‌భాస్ ఒప్పుకుంటాడా?


మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) సిల్వ‌ర్ జూబ్లీ సంవ‌త్స‌రం ఇది. అందులో భాగంగా మా కోసం ఓ స్వంత బిల్డింగ్‌ను నిర్మించుకోవాల‌ని ఫండ్స్ కోసం విదేశాల్లో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ఇంత‌కు ముందు నిర్వ‌హించిన ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాల‌కు చిరంజీవి రెండుస్లారుఅమెరికా వెళ్లి `మా` కు త‌న వంతు స‌హ‌కారం అందించారు. మ‌హేష్ కూడా ఈ పండ్ రైజింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సింది. కానీ ప్రాప‌ర్ ప్లానింగ్ లేక‌పోవ‌డం.. శివాజీరాజా, సీనియ‌ర్ న‌రేష్ మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డంతో మ‌హేష్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మ‌హేష్ ప్లేస్‌లో ప్ర‌భాస్‌ను ఫండ్ రైజింగ్ కోసం విదేశాల‌కు తీసుకెళ్లాల‌ని `మా` అనుకుంటుంద‌ట‌. మ‌రి ప్ర‌భాస్‌ను క‌లిసే దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. మ‌రి ప్ర‌భాస్ ఒప్పుకుని `మా` కోసం ముందుకు వ‌స్తాడా? అని చూడాలి.