Prabash: టాలీవుడ్ రెబల్ అండ్ ఇండియన్ డార్లింగ్ హీరో అయినటువంటి ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ విడుదలకు సన్నద్ధమౌతోంది. అభిమానులు ఎంతగానో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. దీని తరువాత వరుసగా ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ లైన్ లో వున్నాయి. ఇక వీటి తరువాత ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ వుంది. అయితే దానికి బదులుగా ప్రభాస్ మరో సినిమాకి కూడా కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ చేయనున్నాడని టాక్.
Singer Sunitha: సింగర్ సునీత ఎన్ని వేల పాటలు పాడిందో తెలిస్తే అవాక్కవుతారు?
Prabash: ముగ్గురు భామల కథ!
మారుతి చెప్పిన రొమాంటిక్ కథకి ప్రభాస్ బాగా ఇంప్రెస్ అయ్యాడని టాక్. DVV దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా దీనికి ‘రాజాడీలక్స్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు భోగట్టా. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్‌తో రొమన్స్ చేయనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. అదే గాని జరిగితే మన డార్లింగ్ కెరీర్లో ముగ్గురు భామలతో చేసే తొలి సినిమా ఇదే కానుంది. అంతేకాకుండా, ఈ సినిమా కోసం ఏకంగా మూడు భారీ సెట్స్ నిర్మించబోతున్నారని టాక్.
Karthika Deepam Feb 9 Today Episode: సౌందర్య మామూలుది కాదుగా.. రుద్రాణికి చుక్కలు చూపించిందిగా..?
ఆ త్రీ సెట్స్ ఇక్కడే వేయబోతున్నారట!
దాదాపు సినిమా షూటింగ్ మొత్తం ఈ మూడు సెట్స్ లోనే జరపనున్నారట. ఇక ఈ మూడు సెట్స్ అల్లు స్డూడియోస్ లో కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించనున్నారని వినికిడి. గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ చిత్ర విడుదల నేపథ్యంలో బిజీగా వున్న మారుతి.. తదుపరి చిత్రం ప్రభాస్ తోనే పట్టాలెక్కించనున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం పూర్తయ్యే లోపు ప్రభాస్ ఈ సినిమాను కంప్లీట్ చేయబోతాడని సమాచారం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!