NewsOrbit
సినిమా

Radhey Shyam: ఈ 3 హైలైట్ లు చాలు.. ‘రాధే శ్యామ్’ బ్లాక్ బస్టర్ అవ్వడానికి!

Share

Radhey Shyam: ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా గురించే టాపిక్ కనబడుతోంది. ఎందుకంటే ఈనెల అనగా మార్చి 11న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ మూవీ విడుదల కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈక్రమంలోనే రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ అంటూ తాజాగా విడుదల చేశారు. ముంబైలో ఈ మేరకు గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం తెలిసినదే.

Radhey Shyam: ఢిల్లీ మెట్రో ట్రైన్.. లోకల్ ట్రైన్ లో.. “రాధేశ్యాం”..!!

Radhey Shyam: ఈ ఈవెంట్‌ హైలెట్స్ ఇవే..

ఈ ఈవెంట్‌లో ప్రభాస్ చాలా అందంగా కనిపించాడు. గడ్డం, నెత్తి మీద టోపీ, క్లాస్ మాస్ లుక్కును చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మొదట రిలీజైన టీజర్, ట్రైలర్ కంటే కూడా ఈ రిలీజ్ ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది. “మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడుతుంటాం, కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయ్!” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పుకోవాలి. తరువాత “ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు!” అంటూ పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ మరో హైలెట్ అని చెప్పుకోవాలి. అలాగే ఇక ట్రైలర్‌లో విజువల్స్ మరో హైలెట్.

Radhey Shyam: “వాలెంటైన్స్ డే” నాడు వైరల్ అవుతున్న ప్రభాస్ న్యూ లుక్..!!
మరింత సమాచారం:

UV క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేయడం విశేషం. జస్టిన్ ప్రభాకరన్ పాటలను సమకూర్చగా తమన్ నేపథ్య సంగీతాన్ని ఇవ్వడం విశేషం. ఈ చిత్రం 70వ దశకంలో జరిగిన కథలాగా కనబడుతుంది. ఈ రిలీజ్ ట్రైలర్‌ను చూస్తుంటే కచ్చితంగా మాస్టర్ పీస్, క్లాసిక్‌గా రాధే శ్యామ్ నిలిచిపోయేలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Share

Related posts

మెగాస్టార్.. పవర్ స్టార్ లతో త్రివిక్రం మెగా మల్టీస్టారర్ … త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ..?

GRK

Samantha: స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. మే 5నే అందుకు ముహూర్తం!

kavya N

VV Vinayak Dilraju: కొత్త ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న దిల్ రాజు, వివి వినాయక్..??

sekhar