NewsOrbit
Entertainment News సినిమా

Adipurush trailer: ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్ కు 100 మిలియన్ ల వ్యూస్..!!

Share

Adipurush trailer: ఇటీవల విడుదలైన ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్ 100 మిలియన్ ల వ్యూస్ సాధించడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్ర చేయడం జరిగింది. సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అన్ని భాషల్లో కలిపి మూడు రోజుల్లోనే 100 మిలియన్ ల వ్యూస్ సాధించినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే ప్రపంచంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ట్రైలర్లు మాత్రమే… నాలుగు సార్లు యూట్యూబ్ లో 100 మిలియన్ ల వ్యూస్… వచ్చాయంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Prabhas Adipurush trailer gets 100 million views

వాస్తవానికి ఈ సినిమా జనవరి నెలలోనే విడుదల కావాల్సింది. అయితే సినిమా గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ప్రారంభంలో చాలా లో క్వాలిటీ లో ఉండటంతో… అభిమానుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. తర్వాత ట్రైలర్ కి వచ్చిన నెగెటివిటీతో మొత్తం మార్పులు చేర్పులు చేసి జూన్ నెలకి సినిమా వాయిదా వేసి తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో అదిరిపోయే రెస్పాన్స్ పాజిటివ్ టాక్ సంపాదించుకున్నారు. జూన్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

Prabhas Adipurush trailer gets 100 million views

విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో “ఆదిపురుష్” ప్రమోషన్స్ నీ భారీ లెవెల్ లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నీ తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు భాషకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయబోతున్నారు. మిగతాభాషలకు సంబంధించి దేశంలో పలు ఇతర ప్రధాన నగరాల్లో మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ గట్టిగా నిర్వహించబోతున్నారు. మొత్తంగా అయితే ఈ సినిమాని అభిమానులకు చేరువ చేయడానికి “ఆదిపురుష్” మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

Acharya-Upasana: `ఆచార్య‌`పై ఉపాస‌న రియాక్ష‌న్ వైర‌ల్‌.. అలా అందేంటి..?

kavya N

Nikhil : మంచులో ఇరుక్కుపోయిన కార్తికేయ 2 టీమ్..!

Teja

Devatha Serial: భలే మ్యాజిక్ చేసిందే రాధ..! ఆదిత్య బాధను తీర్చడాని సత్య ఏం చేసిందంటే..!?

bharani jella