Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ “ఆదిపురుష్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా కెరియర్ లో మొట్టమొదటిసారి బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ పని చేసిన సినిమా. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించాడు. సీత పాత్రలో… కృతి సన్నన్ నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టైం గత ఏడాది రిలీజ్ అయిన టీజర్ చాలా నెగెటివిటీ ఎదుర్కోవటం తెలిసిందే. ఆ సమయంలో ఈ ఏడాది జనవరి నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని… అప్పటి టీజర్ లో ప్రకటించడం జరిగింది.
కానీ అభిమానుల నుండి నెగటివిటి భయంకరమైన ట్రోలింగ్ జరగటంతో… జూన్ 16వ తారీకుకి సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ లో మొత్తం మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇదే సమయంలో సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ జోడించి లేటెస్ట్ ప్రింట్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో “ఆదిపురుష్” టీం సరికొత్త అప్ డేట్ ఇవ్వటం జరిగింది. “జైశ్రీరామ్” అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. హిందీ, తెలుగు భాషల్లో ఈ మోషన్ పోస్టర్ ప్రభాస్ షేర్ చేశారు. “ఛార్ దమ్ దర్శించుకో లేకుంటే.
ప్రభువు శ్రీరాముడి పేరు స్మరించుకుంటే చాలు”..అని క్యాప్షన్ పెట్టారు. కాగా, పాన్ ఇండియా నేపథ్యంలో ఈనెల 16వ తారీకు సినిమా విడుదల కాబోతున్నట్లు తాజా గ్లింప్స్ వీడియోలో స్పష్టం చేయడం జరిగింది. కాగా ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ .. గ్రాఫిక్స్ వర్క్ మొత్తం బాగుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ స్పెషల్ వీడియో రిలీజ్ అవ్వకముందు ఏప్రిల్ 21వ తారీకు నాడు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ పోస్టర్ లో కూడా ప్రభాస్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.
జై శ్రీరామ్ 🏹#JaiShriRam lyrical motion poster out now!
Telugu: https://t.co/CaPyy8NhXz
Hindi: https://t.co/mNUHCfqSMZ#Adipurush #Prabhas @omraut @TSeries @UV_Creations @Retrophiles1 pic.twitter.com/71rg5wr5VU— Prabhas (@PrabhasRaju) April 22, 2023