Prabhas – Allu arjun: అక్కడ ప్రభాస్ పక్కన అల్లు అర్జున్ నిలబడలేకపోయాడా..?

Share

Prabhas – Allu arjun: ఇప్పుడు మన తెలుగు హీరోలందరూ గట్టిగా ఫోకస్ పెట్టింది బాలీవుడ్ మార్కెట్ మీదే. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ మీద పట్టు సాధిస్తే వచ్చే పాపులారిటీ ఇక్కడ సౌత్ మొత్తంతో సమానమని భావిస్తుంటారు. అంతేకాదు హిందీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతాయి కాబట్టి అక్కడ మార్కెట్ రేంజ్ మరో లెవల్‌లో ఉంటుంది. అందుకే తెలుగు సినిమాలను ఇంత కాలం హిందీ వెర్షన్‌లో అనువాదం చేసి వదిలారు. ఇక్కడ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలను అక్కడ హిందీ
ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

prabhas-allu-arjun got positive talk in bollywood
prabhas-allu-arjun got positive talk in bollywood

ఇక బాహుబలి సిరీస్‌లతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత అక్కడ ప్రభాస్‌కు మంచి క్రేజ్ అండ్ మార్కెట్ వచ్చింది. దాంతో ప్రభాస్ ఇప్పుడు హిందీలో స్ట్రైట్ మూవీస్ చేస్తున్నారు. సాహో అన్నీ భాషలలో ఫ్లాపయినా బాలీవుడ్‌లో మాత్రం భారీ వసూళ్ళను రాబట్టింది. అందుకే మన టాలీవుడ్ హీరోలందరూ తమ సినిమాలను హిందీలో రిలీజ్ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు.

Prabhas – Allu arjun: ఇకపై అల్లు అర్జున్ ప్రతీ సినిమా హిందీలో ధైర్యంగా రిలీజ్ చేసేయొచ్చు..

ఈ క్రమంలో పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హిందీలో ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగ్గా నిర్వహించలేదనే మాట వాస్తవం. అయినా అక్కడ పుష్ప: ది రైజ్ పార్ట్ 1 హిట్ సాధించింది. తెలుగుతో పాటు మిగతా భాషలలో పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ప్రభాస్ తర్వాత హిందీలో మార్కెట్ సాధించిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇకపై అల్లు అర్జున్ ప్రతీ సినిమా హిందీలో ధైర్యంగా రిలీజ్ చేసేయొచ్చు అని పుష్ప వసూళ్ళు నిరూపించాయి. ఇక త్వరలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్ బాలీవుడ్‌లో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో చూడాలి


Share

Related posts

Devatha Serial: నామకరణం ఫంక్షన్ కవలలో ఒకరికి రాధ దేవుడమ్మ పేరు పెడితే..!? మరి దేవుడమ్మ ఎవరి పేరు పెట్టిందంటే..!?

bharani jella

Modi: భారత దేశ ప్రధాన మంత్రులలో ఎవరు క్రియేట్ చేయనీ రికార్డ్ క్రియేట్ చేసిన పిఎం మోడీ..!!

sekhar

బ్రేకింగ్: సోనియాకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు… వీడిన సందిగ్దత

Vihari