Prabhas Maruthi: “బాహుబలి” తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం తెలిసిందే. “బాహుబలి” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు ఇతర దేశాలలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. “బాహుబలి” కి ముందు తెలుగులోనే మార్కెట్ ఉండేది. కానీ బాహుబలి తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి మార్కెట్ ఏర్పడింది. దీంతో డార్లింగ్ పాన్ ఇండియా సినిమాల చేస్తూ వస్తున్నాడు. కానీ “బాహుబలి” తర్వాత ఏ సినిమా కూడా విజయం సాధించింది లేదు. నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పైగా ఒక్కో సినిమాకి దాదాపు రెండు సంవత్సరాల టైం కేటాయించడంతో అభిమానులు కూడా ఎంతో నిరుత్సాహం చెందుతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ప్రజెంట్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి”.. సినిమాలు చేస్తున్నారు. వీటిలో “సలార్”… ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతుండగా “కల్కి” వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు చేస్తూనే మరోపక్క డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్స్.. నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాని 2025 సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయబోతున్నారట. కాబట్టి అనుకుంటున్నా విడుదల తేదినీ ఆధారం చేసుకున్ని సినిమా షూటింగ్ షెడ్యూల్ మారుతీ రెడీ చేయడం జరిగిందంట. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.