బాహుబలితో టాలీవుడ్ నుండి నేషనల్ స్టార్ రేంజ్‌కు ప్రభాస్ ఎదిగాడు. ఈయన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్‌తో దక్షిణాది సహా హిందీలో కూడా సినిమాలు విడుదల చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సాహో` అయినా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అయినా ఇండియా వైడ్ విడుదలవుతున్నాయి. మంచి సమయం అనుకున్నప్పుడంతా దొరకదు కాబట్టి.. ప్రభాస్ కూడా ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువ కావాలనుకుంటున్నాడు. అందుకని తన తదుపరి చిత్రాలకు తనే హిందీలో డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అందుకని ఆయన హిందీలో శిక్షణ కూడా తీసుకుంటున్నారట. తర్వలోనే ప్రభాస్ హిందీలో డబ్బింగ్ చెప్పే విషయంలో ఓ క్లారిటీ రానుంది.
previous post
next post