NewsOrbit
సినిమా

Adipurush: ఇది అన్యాయం.. `ఆదిపురుష్‌` టీమ్‌పై డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

Share

Adipurush: పాన్ ఇండియా స్థాన్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్ర‌మే `ఆదిపురుష్‌`. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్ కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్ లు ఈ చిత్రాన్ని దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఇది.

ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, లంకేశుడిగా సైఫ్ అలీఖాన్ మ‌రియు లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల కానుంద‌ని గ‌తంలోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అయితే అంతా బాగానే ఉంది.. కానీ, ఈ సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ రాక‌పోవ‌డంపై డార్లింగ్‌ అభిమానులు చిత్ర టీమ్ పై ఎప్ప‌టినుంచో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మేక‌ర్స్ అక్టోబర్ నుంచి మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారట.

అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఆయ‌న‌ ఫస్ట్ లుక్ పోస్టర్ వదలాలని నిశ్చ‌యించుకున్నార‌ట‌. అయితే ఇప్పుడీ వార్త ఫ్యాన్స్‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కోస‌మే ఇంకా ఐదు నెల‌లు ఆగాలా, ఇది అన్యాయం అంటూ ఆదిపురుష్ టీమ్‌పై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపోతున్నారు. మ‌రి డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మేక‌ర్స్ దిగొచ్చి కాస్త ముందే ఫ‌స్ట్ లుక్‌ను బ‌య‌ట‌కు వ‌దులుతారా..? లేక ప్ర‌భాస్ బ‌ర్త్‌డే వ‌ర‌కు వెయిట్ చేయిస్తారా..? అన్న‌ది చూడాలి.


Share

Related posts

Sreethu Krishnan Cute Looks

Gallery Desk

Shruti Haasan Latest Gallerys

Gallery Desk

F3: మ్యూజిక్ ఫ్రీగా నేర్పిస్తా అంటున్న దేవి శ్రీ ప్రసాద్..!!

sekhar