Radhe shyam: గత రెండేళ్ళకు పైగా పాన్ ఇండియన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా రాధే శ్యామ్. బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా చేసిన ప్రభాస్ అభిమానులందరినీ ఎంతగానో నిరాశపరచింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియన్ సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజైంది. కానీ, ఒక్క హిందీలో తప్ప మిగతా అన్నీ భాషలలో ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో నెక్స్ట్ సినిమా మీద అందరూ నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ అంటూ ప్రభాస్‌తో పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించాడు.

అప్పటి నుంచి టైటిల్‌తో పాటు ప్రభాస్, పూజా హెగ్డేల లుక్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రతీ అప్‌డేట్‌తో అంచనాలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఆ అంచనాలను అసాధారణంగా పెంచాడు రాధాకృష్ణ. ఇక ఇన్నేళ్ళ నుంచి ఎదురుచూస్తున్న సమయం దగ్గరకు రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. కానీ, కరోనా థర్డ్ వేవ్ దెబ్బతో తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పలేదు. చివరికీ ఓటీటీలోనైనా రిలీజ్ చేస్తే చూడాలని అభిమానులు ఆశపడ్డారు.
Radhe shyam: ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఇష్టపడలేదు.
కానీ, మేకర్స్ మాత్రం పోస్ట్ పోన్ చేశారు తప్ప ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఇష్టపడలేదు. అదే ఒక డిసప్పాయింట్‌మెంట్ అయితే మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా చెప్పలేదు. దాంతో తీవ్ర నిరాశలో ఉన్నారు అభిమానులు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టుగా రాధే శ్యామ్ మూవీ వర్కింగ్ స్టిల్స్ వదిలారు. ఇందులో ప్రభాస్ – పూజా హెగ్డేలతో పాటు దర్శకుడు రాధాకృష్ణ ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ చెప్పకుండా ఈ వర్కింగ్ స్టిల్స్ ఎవరికి కావాలి..అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ రాధాకృష్ణను సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారట. అభిమానులను సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న రాధాకృష్ణకు రివర్స్‌లో ఫ్యాన్స్ షాకిచ్చారు. మరి ఇప్పుడైనా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేస్తే ఫ్యాన్స్ కాస్త కూల్ అవుతారు.