Prabhas: `బాహుబలి`తో నేషనల్ స్టార్‌గా మారిన టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తే.. రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగాబాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్ 3డి వర్షన్‌లో వచ్చే ఏడాది జనవరి 12న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కాబోతోంది.
అయితే కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అప్డేట్ బయటకు రాలేదు. ఎన్నో పర్వదినాలు వస్తున్నాయి వెళ్లిపోతున్నాయి. కానీ, ఆదిపురుష్ టీమ్ కనీసం ఫస్ట్ లుక్స్‌ను కూడా విడుదల చేయడం లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా మేకర్స్ మేల్కోవడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా అలిగారు.
అదిపురుష్ అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా.. చిత్ర టీమ్ ఎందుకు స్పందించడం లేదని, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆదిపురుష్ టీమ్ అభిమానుల కోరికను అర్థం చేసుకుని.. వారి అలకను తీరుస్తారో లేదో చూడాలి.
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…
Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…