రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలంటే పడిచచ్చే జనాలున్నారు. డైరెక్టర్ రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఫస్ట్ షో చూడాల్సిందేనని అభిమానులు భావిస్తుంటారు. బాహూబళి, మగధీర, ఈగ, సినిమాలతో తన ప్రత్యేకమైన ప్రతిభను బయటపెట్టారు రాజమౌళి. ఈయన సినిమాల్లో ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు.
కాగా ఈ మధ్యన వచ్చిన భారీ సినిమాలే కాకుండా అంతకు ముందు వచ్చిన సినిమాల్లోనూ తన ప్రతిభను పండించారు రాజమౌళి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డార్లింగ్ ప్రభాస్ తో ఓ భారీ హిట్ కొట్టిన సినిమా ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ కొట్టిందో చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్, ఎమోషన్ ను పండించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ మూవీ. భారీ సెట్స్ చేయకున్నా మదర్ సెంటిమెంట్ తో, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఎంతో అద్బుతంగా ఆకట్టుకుందీ ఈ మూవీ.
ఈ మూవీతో ఇటు డైరెక్టర్ రాజమౌళికి, అటు హీరో ప్రభాస్ కు మంచి పేరు వచ్చింది. కాగా ఈ మూవీ మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. దీనిని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాను మొత్తం బాలీవుడ్ రంగమే చేస్తోంది. ఈ మూవీలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నారు. కాగా బెల్లం కొండ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు కామెడీని, ఇటు యాక్షన్ సీన్స్ పండించడంలో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి ప్రతిభను చూపెడతారు.
అలాగే ఈయన నటించిన తెలుగు సినిమాలన్నింటినీ హిందీలోకి మార్చి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూవర్లను సంపాధించుకున్నారు. దానితో పాటుగా అతని ఫైట్లకు హిందీలో మంచి పేరుందని చెప్పుకోవచ్చు. కాగా ఛత్రపతి సినిమా చేయడ మంటే మామూలు మాటలు కావు. ఎంతో ఎమోషన్, యాక్షన్ సీన్లను పండించాల్సి ఉంటుంది. మరీ ఈ రీమేక్ మూవీకి ఎవరు డైరెక్టర్ గా చేస్తున్నారో వేచి చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!