NewsOrbit
Entertainment News సినిమా

Salaar: “సలార్” సినిమా టీంకు ఊహించని కానుక ఇచ్చిన ప్రభాస్..?

Advertisements
Share

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాలలో “సలార్” పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆగస్టు నెలలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. “సలార్” షూటింగ్ కి సంబంధించి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ క్రమంలో ప్రభాస్ మామూలుగానే తన చుట్టుపక్కల వ్యక్తులకు సినిమా సెట్స్ కి సంబంధించి పనిచేస్తున్న వారికి రకరకాల గిఫ్ట్స్.. మరియు వంటకాలు భోజనాలతో సర్ప్రైజ్ లు ఇస్తుంటారన టాక్ ఎప్పటినుండో వుంది.

Advertisements

Prabhas gave an unexpected gift to Salaar film team

ప్రభాస్ ఆదిత్యం మరువలేనిది అని చాలామంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల సైతం ఓపెన్ గా మీడియా ముందు ఇటీవల తెలిపారు. తాజాగా “సలార్” సినిమా చివరి దశకు చేరుకోవటంతో సినిమా కోసం పనిచేస్తున్న టీం సభ్యులందరి ఖాతాలో ₹10,000 బహుమతిగా ఇవ్వటం జరిగిందట. మూవీ కోసం యూనిట్ సభ్యులంతా చాలా శ్రమించారని అందుకని తనవంతుగా ప్రభాస్ ఈ బహుమతినీ వ్యక్తిగతంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో “రాదేశ్యం” సినిమా యూనిట్ సభ్యులందరికీ వాచీలు బహుమతిగా డార్లింగ్ ప్రభాస్ ఇవ్వడం జరిగింది. కాగా ఇప్పుడు “సలార్” సినిమా యూనిటీ సభ్యులకు ₹10,000 వ్యక్తిగతమైన డబ్బు సినిమా కోసం పనిచేసిన వారి అకౌంట్లో వేయటంతో ఆ వార్త సోషల్ మీడియాలో రావటంతో నువ్వు నిజంగా డార్లింగ్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisements

Prabhas gave an unexpected gift to Salaar film team

“సలార్” కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే జూన్ 16వ తారీకు అనగా రేపు ప్రపంచవ్యాప్తంగా “ఆదిపురుష్” విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాని ప్రభాస్ అమెరికాలో ప్రత్యేకంగా చూడబోతున్నట్లు ఆల్రెడీ అక్కడికి వెళ్లిపోయినట్లు సమాచారం. భారీ అంచనాలు మధ్య “ఆదిపురుష్” విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వసూలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పాజిటివ్ టాక్ వస్తే.. నిర్మాతలకు లాభాల పంట పండటం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల అంచనా.


Share
Advertisements

Related posts

GodFather: “గాడ్ ఫాదర్” లో రోల్ చెయ్యాలి .. అనగానే పూరి రియాక్షన్ గురించి చెప్పిన చిరంజీవి..!

sekhar

AdiPurush: “ఆదిపురుష్” పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖన్నా..!!

sekhar

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్‌బాస్‌కి స‌ర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ ఇదే..!

kavya N