Prabhas – Maruthi: ప్రభాస్ చెప్తే మారుతి ఏంటీ ఎవరైనా వినాల్సిందే..లేదంటే అంతే..! అంటూ డార్లింగ్ అభిమానులు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను మారుతి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇది ఫిక్స్. వీరి కాంబోలో ఒక సినిమా కన్ఫర్మ్ కాబోతోంది. రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటకన ఇవ్వబోతుంది చిత్రబృందం. ఇక ఇందు లో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని సంచారం. అంతేకాదు ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మించనున్నారట. అయితే ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేలా దర్శకుడు మారుతి షెడ్యూల్స్ ప్లాన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమాకు గతకొన్ని రోజులుగా రాజా డీలక్స్ టైటిల్ పెట్టనున్నట్టు ప్రచారం అవుతోంది. అయితే, ఈ టైటిల్ ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోయేలా లేదనే కామెంట్స్ వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ రాజా డీలక్స్ ఏంటీ అంటూ ఫన్నీగా కూడా మాట్లాడుకుంటున్నారట. ఈ నేపథ్యంలో రాజా డీలక్స్ కాకుండా మరో మాస్ టైటిల్ అయితే బావుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ విన్న సమయంలో రాజా డీలక్స్ కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ టైటిల్ చూడమని డార్లింగ్ ప్రభాస్ మారుతికి చెప్పారట.
Prabhas – Maruthi: ఈ టైటిల్‌కు నెగిటివ్ రెస్పాన్స్..!
స్క్రిప్ట్ విషయంలో అంతా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఈ కథ విని ప్రభాస్ కూడా ఎంతో చాలా ఎగ్జైట్ అయ్యారట. ఇప్పటికే సెట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఇక రాజా డీలక్స్ టైటిల్ కూడా ముందు ప్రభాస్ ఓకే అనుకున్నారట. అయితే, ప్రేక్షకుల్లో ఈ టైటిల్‌కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ ఫైనల్‌గా టైటిల్ ను మార్చాలనే నిర్ణయానికి వచ్చారట. దాంతో దర్శకుడు మారుతికి కొత్త టైటిల్ చూడమని చెప్పారట. మరి ఇప్పుడు మారుతి దీని కోసం ఎలాంటి టైటిల్‌ను సెలెక్ట్ చేస్తాడో చూడాలి. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్ జరుగుతున్నాయి. బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది.