Prabhas Heroine: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ స్టార్ ప్రభాస్‌కు జోడీగా `సాహో` చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
బి-టౌన్లో ఎక్కడ చూసిన వీరిద్దరూ జంటగా కనిపించడం, విందులు వినోదాలకు జంటగా హాజరు కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ కన్ఫార్మ్ చేసేసుకున్నారు. పైగా త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా శ్రద్ధ, రోమాన్లు బ్రేకప్ చెప్పుకున్నారనే టాక్ మొదలైంది.
ఇటీవల రోహన్.. శ్రద్దా గురించి కానీ, ఆమె.. అతడి గురించి కానీ మాట్లాడింది లేదు, బయట ఎక్కడ కనిపించింది లేదు. ఇటీవలే శ్రద్దా కపూర్ తన బర్త్‌డే వేడుకలు గోవాలో ఘనంగా జరుపుకుంది. స్నేహితులు, సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ రోహన్ మాత్రం ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విష్ చేయకపోవడం బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి బ్రేకప్ మ్యాటర్‌పై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రణబీర్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తున్న శ్రద్ధా.. మరోవైపు `చాల్ బాజ్`, `నాగిన్` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నట్లు టాక్.