NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ నటించబోతుం దని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణ్. రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియన్ హీరోల లిస్ట్‌లో చేరాడు. ఇప్పుడు తన టార్గెట్ బాలీవుడ్ అండ్ పాన్ ఇండియన్ సినిమాలే అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే తన కొత్త సినిమాలను పాన్ ఇండియన్ రేంజ్లో స్క్రిప్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే తారక్ నటించాల్సిన సినిమా కన్ఫర్మ్ అయింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. గత ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ కారణంగా మళ్ళీ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారట. జూన్ నుంచి ఈ సినిమాను కొరటాల సెట్స్ మీదకు తీసుకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెలలో 29న ఆచార్య సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఆయన దృష్ఠి మొత్తం దాని మీదే ఉంది. ఈ సినిమా రిలీజైయ్యాక ఎన్టీఆర్ మూవీ పనులు మొదలవనున్నాయి.
NTR: మైత్రీ మూవీ మేకర్స్ దీపికను తీసుకోవాల నుకుంటున్నారట.
ఇదే క్రమంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ప్రస్తుతం సలార్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్ మరొకవైపు నుంచి ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెట్టినట్టు తాజా సమాచారం. దీనిలో భాగంగానే మేకర్స్ ఎన్టీఆర్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణ్ను ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దీపిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె సినిమాను చేస్తోంది. అలాగే, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ దీపికను తీసుకోవాలనుకుంటున్నారట. ఆల్రెడీ కొరటాల – ఎన్టీఆర్ సినిమాలో ఆలియా భట్ నటిస్తోంది. అందుకే, మరో సినిమాకు కూడా బాలీవుడ్ బ్యూటీనే ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.