Prabhas: “బాహుబలి” సినిమా ప్రభాస్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినీ ప్రేమికులకు తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ఒకప్పుడు బాలీవుడ్ గురించి మాట్లాడే వాళ్ళు కానీ “బాహుబలి” విజయంతో ప్రభాస్ గురించి మాట్లాడుకునే పరిస్థితి రాజమౌళి తీసుకొచ్చారు. ఆ స్థాయిలో విజయం సాధించిన “బాహుబలి” లో ప్రేక్షకులను బాగా అలరించింది సన్నివేశాలు యుద్ధ సన్నివేశాలు.
ప్రభాస్ గుర్రపు స్వారీ… కత్తి పట్టుకుని సరికొత్త స్టైల్ లో రాజు కు తగ్గ కటౌట్ తో ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇదిలా ఉంటే మరో సారి రుజువు చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళితే “కేజిఎఫ్” లాంటి మాస్ హైవోల్టేజ్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకటి మాఫియా లీడర్ పాత్ర అని మరొకటి ఆర్మీ పాత్ర ప్రభాస్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ ఆర్మీ పాత్రలో శత్రుదేశం తో పెద్ద యుద్ధం జరిగే సన్నివేశం స్క్రిప్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసినట్లు, అదే సినిమాకి హైలెట్ అవుతుందని సోషల్ మీడియాలో కూడా ప్రజెంట్ ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ “బాహుబలి” లో కత్తి తో ఫైట్ చేస్తే “సలార్” సినిమాలో గన్ తో యుద్ధం చేయటానికి రెడీ అవుతున్నట్లు నెటిజన్లు..అభిమానులు డిస్కషన్స్ స్టార్ట్ చేశారు.