Unstoppable 2: “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ కి చాలా పెద్ద పెద్ద స్టార్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ చాలామంది ప్రేక్షకులను అలరించింది. మొదటి సీజన్ తోనే దేశంలో అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ స్థానంలో నిలవడం తెలిసిందే. దీంతో రెండో సీజన్ చాలా గ్రాండ్ గా ఆహా టీం ప్లాన్ చేసింది. సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను తీసుకువచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ కలిగించింది. ఈ క్రమంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రావటం తెలిసిందే.
ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ రెండు భాగాలుగా ఆహా షూట్ చేయడం జరిగింది. మొదటి భాగాన్ని ఆల్రెడీ డిసెంబర్ 29వ తారీకు స్ట్రీమింగ్ చేశారు. ఊహించని రేంజ్ లో వ్యూస్ రికార్డు స్థాయిలో వస్తున్నాయి. అయితే రెండో ఎపిసోడ్ జనవరి 6వ తారీకు విడుదల కానున్న క్రమంలో లేటెస్ట్ గా ఆహా టీం ప్రోమో రిలీజ్ చేసింది. ఈ సెకండ్ ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్యతో ప్రభాస్ చాలా ఫ్రీగా కలిసిపోయాడు. మొదటి భాగంలో కాస్త సిగ్గు బిడియం తో కనిపించిన ప్రభాస్ రెండో ప్రోమోలో మాత్రం చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం విశేషం.
గోపీచంద్ నీ కొట్టడం… బాలయ్యతో కాస్త చనువుగా ఉన్నాడు. ఇక బాహుబలి వంటి అతి పెద్ద విజయం తర్వాత ఏ సినిమా చేయాలి అన్నదానిపై.. కూడా బాలకృష్ణ ఈ ప్రోమోలో ఆసక్తికరమైన ప్రశ్నలు వేయడం జరిగింది. మొదటి ఎపిసోడ్ లో పెళ్లి గురించి ఇంకా ప్రభాస్ ఫామ్ హౌస్ గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. హీరో రామ్ చరణ్ తో ప్రభాస్ గురించి బాలకృష్ణ మాట్లాడటం హైలెట్. సరిగ్గా మొదటి ఎపిసోడ్ లో గోపీచంద్ వచ్చాక… ఆగిపోయింది. దీంతో ఇప్పుడు రెండో ఎపిసోడ్ లో గోపీచంద్ తో ప్రభాస్ ముచ్చట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Darlinggggssss…Part 2 Premiering on Jan 6th 😉 pic.twitter.com/24HieKiGrL
— ahavideoin (@ahavideoIN) January 4, 2023
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!