Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్లో బాహుబలి సిరీస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమా సిరీస్‌తోనే ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. టాలీవుడ్లో పాన్ ఇండియన్ సినిమా అనే ఫార్మాట్ మొదలైంది. అందరూ మన తెలుగు సినిమా గొప్పతనం ఏంటో తెలుసుకున్నారు. ఇలాంటి సిరీస్ మళ్ళీ ప్రభాస్ చేస్తుండటం విశేషం. ఇది ఎంతవరకూ నిజమో తెలీదు గానీ సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో అంతటా ఇదే న్యూస్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే రాధే శ్యామ్ లాంటి పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరి చేస్తున్న డార్లింగ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్నారు.
ఆ సినిమానే సలార్. కేజీఎఫ్ సిరీస్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. హోంబలే నిర్మాణ సంస్థపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా శృతి హాసన్ ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈపాటికే సలార్ భారీ స్థాయిలో రిలీక్ కావాల్సి ఉండగా కరోనా వేవ్స్ మూలంగా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఒకవైపు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటం, మరొకవైపు సలార్ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ సాలీడ్ న్యూస్ వచ్చి అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది.
Prabhas: సలార్ బాహుబలి సిరీస్ మాదిరిగా రెండు భాగాలు..!
అదే సలార్ బాహుబలి సిరీస్ మాదిరిగా రెండు భాగాలుగా రూపొందనుందట. తెలుగులో బాహుబలి తర్వాత మళ్ళీ పుష్ప రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ క్రమంలో మరోసారి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చిత్రయూనిట్ త్వరలో ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఈ ప్రకటన వస్తే మాత్రం ప్రభాస్ అభిమానుల్లో పట్టరాని ఆనందం నెలకొంటుందనడంలో సందేహమే లేదు. కాగా, ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శృతి హాసన్ లుక్‌ను ఆమె బర్త్ డే సందర్భంగా వదిలారు. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.