Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “సలార్” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. “కేజీఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో… అభిమానులకు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రకు సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఈ సినిమాలో శృతిహాసన్ కూడా యాక్షన్ సన్నివేశాలలో… అదరగొట్టినట్లు సమాచారం. సెప్టెంబర్ 28వ తారీకు “సలార్” సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కి బ్రేక్ పడినట్లు టాక్ రావటం జరిగింది.
అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అంట. దీనిలో భాగంగా లేటెస్ట్ గా మొదలైన షెడ్యూల్ లో క్లైమాక్స్ కి సంబంధించి యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఈ క్లైమాక్స్ లో దాదాపు 400 మందితో ప్రభాస్ తలపడనున్నాడట. ఇందుకోసం హై లెవెల్ టెక్నాలజీ కెమెరాలను ప్రశాంత్ నీల్ వాడుతున్నాడట. ఇంచుమించు కేజిఎఫ్ తరహా స్థాయి క్లైమాక్స్ మాదిరిగానే….”సలార్”ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ నటించిన అన్ని యాక్షన్ సన్నివేశాలు కంటే ఇది హై లెవెల్ లో… భారీ యాక్షన్ వోల్టేజ్ సన్నివేశాలు ఉండే మాదిరిగా “సలార్” క్లైమాక్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం.
“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ పడలేదు. సాహో, రాధే శ్యామ్ రెండు కూడా పరాజయాలు అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ “సలార్” పైనే ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కేజిఎఫ్ సినిమాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. హీరో యాష్ కి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. సో ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరో కాబట్టి…”సలార్”తో.. కేజిఎఫ్ తరహా హిట్ పడింది అంటే ప్రభాస్ కి తిరుగుండదని ఫ్యాన్స్ అంటున్నారు.