Prabhas: డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న ఎక్కువే. మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన వారిలో మొదటి వాడు ప్రభాస్. బాహుబలి తరువాత ప్రభాస్ తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సాహో – రాధేశ్యామ్ ఫలితాలు ప్రభాస్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ రెండిటికీ ‘వన్ ఫిలిం డైరెక్టర్స్’ కెప్లెన్సీ వహించడం విశేషం. అలాంటి తప్పిదాలు చేసేందుకు ఇతర స్టార్ హీరోలు ఎవరూ సిద్ధంగా లేరని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Prabhas: ప్రయోగాలు మానుకుంటేనే మంచిదా..?
Prabhas: మిగతా సూపర్ స్టార్లు తెగించలేరా?
మన సూపర్ స్టార్స్ మహేష్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, చరణ్, NTR వంటివారు ఇలాంటి ప్రయోగాలకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పవన్ విషయానికొస్తే రాజకీయాల్లో తనమునకలై వున్నాడు గనుక ఆయన రిస్కు తీసుకోలేదు అనుకుందాం. మిగతా వారికి ఏమైంది. అందువల్ల పదుల సంఖ్యలో మన చుట్టూ వున్న నవతరం దర్శకులకు అవకాశాలు రాలేదని టాలీవుడ్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ అస్సలు కొత్త వాళ్లతో ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు అని అంతా అనుకుంటున్నారు. సేఫ్ గేమ్ ఆడుతాడనే అపవాదు మహేష్ పైన వున్నది.
Prabhas: తన క్రేజీ ప్రాజెక్టుల్లో ఆ స్టార్ హీరో కోసం పట్టుబడుతున్న ప్రభాస్..??
అందుకే చేయలేరా?
ఎన్టీఆర్ సైతం రాజమౌళి- కొరటాల- త్రివిక్రమ్ అంటూ పెద్ద దర్శకుల వైపే ముగ్గు చూపుతున్నాడు గాని చిన్నవారికి అవకాశాలు ఇవ్వడం లేదు. రామ్ చరణ్ ఏకంగా రాజమౌళి తరవాత శంకర్ తో కలిసి పని చేస్తున్నారు. మధ్యలో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరికి అవకాశం ఇవ్వడం ఆసక్తికరం. ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిరంతరం త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తూ బంపర్ హిట్లకు అలవాటు పడ్డాడు. అందువల్ల ఒక కొత్త దర్శకుడు తనకు కథ చెప్పినా కానీ అంత సులువుగా ఎక్కడం లేదనే వాదనలు బయట వినబడుతున్నాయి. మరి ఇలాంటి వాటికి మనవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!