HBD Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయిన తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. “బాహుబలి” విజయం తర్వాత ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిన తరువాత… సరైన హిట్ ప్రభాస్ అందుకోలేకపోయాడు. “బాహుబలి” తర్వాత ప్రభాస్ చేసిన సాహూ, రాదేశ్యాం రెండు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తెలిసిందే. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్టుకే సినిమాలు చేస్తున్నారు. ఈ మూడింటిలో “ఆదిపురుష్” వచ్చే జనవరి 12వ తారీకు విడుదల కానుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా 3d ఫార్మేట్ లో విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ .. అక్టోబర్ మూడవ తారీకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చూసిన ప్రభాస్ అభిమానులు ఎంతో నిరోత్సాహానికి గురయ్యారు. చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్ మాదిరిగా గ్రాఫిక్స్ ఉండటంతో భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఈనెల 23వ తారీకు పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి ప్రభాస్ డిసైడ్ అయ్యారట. “ఆదిపురుష్” టీజర్ నిరాశపరచడంతో సలార్, ప్రాజెక్టుకి సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు ఇచ్చే విధంగా ప్రభాస్ సినిమా మేకర్స్ తో డిస్కషన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఈనెల 23వ తారీకు నాడు ఈ రెండు సినిమాలకు సంబంధించి పోస్టర్ లేదా వీడియోలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా “ప్రాజెక్టుకే” సినిమాని నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ప్రాజెక్టుకే” షూటింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజు నాడు ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.