యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి జోరుమీద ఉన్నాడు. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అధికారికంగా “సలార్” ప్రాజెక్టు ప్రకటించి ఫ్యాన్స్ ని ఇటీవల సంతోష పరచిన ప్రభాస్ త్వరలో ప్రస్తుతం జీల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న “రాధేశ్యాం” టీజర్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను వేదికగా చేసుకుని ప్రభాస్ టీజర్ రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాతకాలం నాటి ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించాయి. ఇటువంటి తరుణంలో తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ కానుకగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ కోసం ‘రాధే శ్యామ్’ నుంచి ఓ 30 సెకన్ల వీడియోని రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. రొమాంటిక్ తరహాలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.
కృష్ణంరాజు నిర్మాణసంస్థ గోపీకృష్ణ మూవీస్ అదేవిధంగా ప్రభాస్ స్నేహితుల బ్యానర్ యువి క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు సినిమా యూనిట్. వాస్తవానికి ‘రాధే శ్యామ్’ టీజర్ ని న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయాలని సినిమా యూనిట్ భావించగా.. నాకు నిమిషంలో క్యాన్సిల్ అవ్వటంతో అభిమానులు నిరాశ చెందటం తో ఈ సంక్రాంతిని టార్గెట్ చేసుకుని అభిమానులను అలరించడానికి ‘రాధే శ్యామ్’ టీజర్ ని ప్రభాస్ విడుదల చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.