Entertainment News సినిమా

Prabhas: మళ్లీ షూటింగ్స్ కి రెడీ అయిపోయిన ప్రభాస్..?

Share

Prabhas: సెప్టెంబర్ 11వ తారీకు ప్రభాస్ పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడం తెలిసిందే. దీంతో ప్రభాస్ అంతా తానై అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదారుస్తూ.. ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ప్రభాస్ కొన్నాళ్లపాటు షూటింగ్ లకు వెళ్లే అవకాశం లేదని వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే నెలలో కృష్ణంరాజు సొంతూరు భీమవరం దగ్గర మొగల్తూరులో స్మారక సభ.. నిర్వహిస్తూ ఉన్నారు.  29వ తారీకు నాడు జరగబోయే ఈ కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి చాలామంది అభిమానులకు భోజనాలు ఏర్పాట్లు మొత్తం ప్రభాస్ చూసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

Prabhas is ready for shooting again
Prabhas

ఇన్ని పనులు మొత్తం ఉండటంతో ప్రభాస్ కనీసం నెల రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా వచ్చే వారం నుండే మళ్లీ సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే, ఆది పురుష్.. సినిమాలు చేస్తున్నారు. వీటిలో అన్నిటికంటే ముందు “ఆది పురుష్” వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది. అంతేకాదు దసరా పండుగ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Prabhas is ready for shooting again
Prabhas

బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఆధ్వర్యంలో తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. ఈ కారణంగా వచ్చే వారం నుండే… మళ్లీ షూటింగ్ లలో జాయిన్ అవుతున్నారట. సెప్టెంబర్ 29వ తారీకు మొగల్తూరులో జరగబోయే కృష్ణంరాజు స్మరక సభ అనంతరం.. ప్రభాస్.. యధావిధిగా షూటింగ్ లలో జాయిన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Thaman: సూపర్ స్టార్ సక్సెస్ థమన్ మీదే ఆధారపడి ఉందా..?

GRK

ఇంట్లో ఉండే కోట్లు సంపాదిస్తున్న కాజల్.. అదెలాగంటే!

Ram

బ‌న్నితో కాజ‌ల్ స్సెష‌ల్‌

Siva Prasad