Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రయోగాలు మానుకుంటే మంచిదా..ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమా తర్వాత చాలామందిలో ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. వాస్తవంగా ప్రభాస్ అంటే మంచి కమర్షియల్ అండ్ పక్కా మాస్ ఎంటర్టైనర్ కోరుకుంటున్నా రు అభిమానులు. ఆయన సినిమాలలో రొమాన్స్, యాక్షన్ సమానంగా ఉండేలా అయితేనే ఆదరణ దక్కుతోంది. ఆ విషయం ఇప్పటికే కొన్ని సినిమాలతో అర్థమైంది. కథ బావుండి ప్రభాస్ సాహసం చేసి ప్రయోగం చేసినా దాని ఫలితం రాధే శ్యామ్ సినిమాగానే మిగులుతోంది దీనికి ఉదాహరణ ప్రభాస్ సినిమాలు చాలానే ఉన్నాయి.
మంచి కమర్షియల్ హిట్ అందుకున్న తర్వాత ఓ ప్రయోగం చేసి దెబ్బ తింటున్నాడు. బాహుబ లి లాంటి భారీ సినిమా సిరీస్‌లో నటించి ఏకంగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న హీరోగా ప్రభాస్ నిలిచారు. కానీ, ఆ తర్వాత అరిగిపోయిన కథతో సాహో అని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా చేసి ఫ్లాప్ చూశారు. దాంతో అయినా తేరుకొని మంచి కథ లను ఎంచుకుంటారని అందరూ భావించారు. కానీ, పదేళ్ళ తర్వాత ప్రభాస్ చేసిన అద్భుత మైన రొమాంటిక్ సినిమా అంటూ ఊదరగొట్టారు. కట్ చేస్తే రాధే శ్యామ్ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే.
Prabhas: సలార్ యాక్షన్ సినిమా.. మిగతా రెండు మళ్ళీ ప్రయోగాలే.
భారీ బడ్జెట్ పెట్టి ఓ స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాదనే మాటలు అందరూ అభిప్రాయపడ్డా రు. ఇదే కాదు, గతంలో కూడా ప్రభాస్ చక్రం, పౌర్ణమి లాంటి సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు. ఇలాంటి కథలు ప్రభాస్‌కు సూటవవు. ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే, ఇకపై ఆయన ఇమేజ్ను పెంచే సినిమాలు చేస్తేనే బెటర్ అని..అనవసరమైన ప్రయోగాలు చేసి అభిమానులకు నిరాశ, నిర్మాతలకు నష్టాలను కలిగించొద్దని అంటున్నారు. మరి మన డార్లింగ్ రాబోతున్న సినిమాలతో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా సాలీడ్ హిట్స్ అందుకుంటే చూడాలి. ఇప్పుడు చేస్తున్న సినిమాలలో సలార్ యాక్షన్ సినిమా. మిగతా రెండు మళ్ళీ ప్రయోగాత్మక సినిమాలే.